శ్రీకాకుళం జిల్లా అరసవల్లి ఆదిత్యుని ఆలయంలో ప్రధాన వార్షిక ఉత్సవం రథసప్తమిను అంగరంగవైభవంగా జరిపేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఆదేశించారు. ఈ మేరకు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలసి రథసప్తమి ఏర్పాట్లపై కలెక్టర్ స్వప్నిల్ పుండ్కర్, ఎస్పీ మహేశ్వర రెడ్డిలతో సోమవారం సమీక్షించారు.