AKP: ఎస్ రాయవరం మండలం అడ్డరోడ్డులో సోమవారం ఉదయం ముగ్గురు సిపిఎం నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఉదయం అడ్డరోడ్డు జంక్షన్లో సిపిఎం నాయకులు డి. వెంకన్న, శ్రీనివాసరావు, సత్తిబాబు షాపులను మూయిస్తుండగా సీఐ రామకృష్ణ, ఎస్సై విభీషణరావు వారిని అదుపులోకి తీసుకుని ఎస్ రాయవరం పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్రమంగా తమను అరెస్టు చేశారని వారు తెలిపారు.