MBNR: జిల్లాలో నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు చలితీవ్రత స్వల్పంగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో అత్యల్పంగా రాజాపూర్ మండల కేంద్రంలో 10.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. దోనూర్ 10.9°C, సాల్కర్ పేట 11.0°C, జడ్చర్ల, కొత్తపల్లి 11.1°C, మిడ్జీల్ 11.2°C, భూత్పూర్ 11.7°C, హన్వాడ 12.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.