ADB: కవ్వాల్ అభయారణ్యంలోని అన్ని గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని అటవీశాఖ అధికారులు అడ్డుకోకుండా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జ కోరారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సోమవారం ఆయన మాట్లాడారు. అభయారణ్యం పరిధిలోని గ్రామాలలో ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని అటవీ అధికారులు అడ్డుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.