VZM: వేపాడ మండలం సోంపురం, జాకేరు తదితర గ్రామాల్లో సోమవారం ఉదయం పొగ మంచు విపరీతంగా కురిసింది. ఉదయం 8 గంటలైనప్పటికీ మంచు తీవ్రత తగ్గకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. లైట్లు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. మంచు కారణంగా మామిడి, మినుము, పెసర పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని రైతులు అంటున్నారు.