NZB: నిషేధిత చైనా మాంజ విక్రయిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు NZB 3 టౌన్ ఎస్ఐ హరిబాబు తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు నగరంలోని గౌతమ్ నగర్, కెనాల్కట్ట ప్రాంతాల్లో సంక్రాంతి పండుగ సందర్భంగా గాలిపటాలు, మాంజాలు అమ్ముతున్న షాపులపై తనిఖీలు చేశామన్నారు. చైనా మంజా విక్రయిస్తున్న ప్రమోద్, మహమ్మద్ యూనుస్, ఇప్ప సాయితేజను అరెస్టు చేశామన్నారు. నిషేధిత చైనా మాంజ విక్రయిస్తే చర్యలు తప్పవని తెలిపారు.