NLR: ఉదయగిరి ఘాట్ రోడ్డులో గత నాలుగైదు రోజులుగా పులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. అటవీశాఖ అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా పులి జాడ కనిపెట్టలేకపోతున్నారు. కొత్తపల్లి,ఉదయగిరి వెస్ట్, నందిపాడు బీట్ ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. మేత కోసం అడవికి వెళ్లకపోతే జీవాలకు ఇబ్బంది, అడవికి వెళ్తే పులి వస్తుందేమో అన్న భయంతో పశువుల కాపరులు వణికిపోతున్నారు.