BPT: బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పేరుతో సోషల్ మీడియాలో చలామణి అవుతున్న నకిలీ ఫేస్బుక్ ఖాతాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదివారం ఓ ప్రకటనలో సూచించారు. సైబర్ నేరగాళ్లు కలెక్టర్ ఫోటోను వాడుతూ, మెసేజ్లు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, ఆ ఖాతాల నుండి వచ్చే సందేశాలను నమ్మి మోసపోవద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.