WGL: నర్సంపేట పట్టణ CI రఘు సోమవారం మీడియాతో మాట్లాడారు. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ పై నిఘా పెంచామని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల భద్రతే లక్ష్యంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని, అందరూ బాధ్యతగా ఉండి శాంతియుతంగా వేడుకలు జరుపుకోవాలని CI కోరారు.