BDK: చర్ల మండలం కేంద్రంలో కేశాపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ఆదివారం ఎమ్మెల్యే డాక్టర్ తెల్ల వెంకటరావు ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధిలో గ్రామపంచాయతీ కీలక పాత్ర పోషిస్తుందని MLA తెలిపారు. ప్రజలకు అవసరమైన సేవలు ఒకేచోట అందుబాటులోకి వస్తాయని అన్నారు. గ్రామ సమస్యలను పరిష్కరించేందుకు ఈ కార్యాలయం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.