HYD: కంటోన్మెంట్ నియోజకవర్గంలో సివిలియన్ నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మద ఆధ్వర్యంలో కేవలం 10 నెలల వ్యవధిలో రూ. 15 కోట్ల విస్తృత అభివృద్ధి పనులు చేపట్టిన ఘనత BJPకి దక్కిందని మల్కాజ్గిరి MP ఈటల రాజేందర్ అన్నారు. రాజరాజేశ్వరి గార్డెన్లో అభివృద్ధి శీర్షిక పేరుతో కంటోన్మెంట్ ప్రజానీకంతో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్టాడారు.