NZB: కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దుచేసి పేద ప్రజలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తుందని బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆదివారం అన్నారు. కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.