SRD: క్రీడలపైన ఆసక్తి పెంపొందించేలా కార్యక్రమాలు రూపొందించాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్ పూర్ డివిజన్ పరిధిలోని ఆర్టీసీ సువర్ణ వ్యాలీ కాలనీలో కాలనీ వాసుల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన బాక్స్ క్రికెట్ గ్రౌండ్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా సరదాగా క్రికెట్ ఆడి స్థానికులను ఉత్సాహపరిచారు.