NRPT: మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లా రోహాలో జరిగిన 6వ నేషనల్ మిక్స్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో ఉట్కూర్ మండలం లక్ష్మీపల్లికి చెందిన శ్రీరామ్ అద్భుత ప్రతిభకనబరిచి బంగారు పతకం సాధించాడు. ఈ నెల 26 నుంచి 28 వరకు జరిగిన పోటీల్లో శ్రీరామ్ విజేతగా నిలిచి రాష్ట్ర కీర్తిని జాతీయ స్థాయిలో చాటాడు.