VZM: కొత్తవలస(మం) దాసరివానిపాలెం వద్ద కొత్తగా నిర్మించిన రామ్ సాయి ఫంక్షన్ హాల్లో జరిగిన శ్రీ సత్యసాయి 108 భజనలో ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. శ్రీ సత్యసాయి ఆశీస్సులతో ఫంక్షన్ హాల్ అభివృద్ది చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో దాసరి కార్పొరేషన్ ఛైర్మన్ రత్నాజీ, పీఏసీఎస్ అధ్యక్షుడు పాల్గొన్నారు.