KRNL: దేవనకొండకు చెందిన డీలర్ లక్ష్మన్న(52) ఆదివారం గుండెపోటుతో అకస్మాత్తుగా మృతి చెందారు. ఆరోగ్యంగా ఉన్న ఆయన ఒక్కసారిగా అస్వస్థతకు గురై కన్నుమూశారు. ఈ వార్తతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. విషయం తెలిసిన బంధుమిత్రులు, గ్రామస్థులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.