SRCL: TSUTF రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశాలకు జిల్లాలోని ఆ సంఘం నాయకులు తరలివెళ్లారు. ఈనెల 28, 29 జనగామ జిల్లా కేంద్రంలో ఈ సదస్సు జరుగుతుందన్నారు. రెండు రోజులపాటు జరిగే సమావేశాల్లో ప్రభుత్వ విద్య రంగం బలోపేతంపై కార్యచరణ చర్చించడం జరుగుతుందని జిల్లా ప్రధాన కార్యదర్శి జంగటి రాజు తెలిపారు. సదస్సుకు వెళ్లిన వారిలో మహేందర్, రమేష్, తిరుపతి పాల్గొన్నారు.