NRPT: రైతులు తాము పండించిన పంటలకు ధర నిర్ణయించిన రోజే రైతు లాభాల బాటలో పయనిస్తారని ఆదివారం ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. మరికల్ మండల కేంద్రంలో ఓ ప్రైవేటు పాఠశాలలో రైతు దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. పారిశ్రామిక వేత్తలు తాము తయారుచేసిన వస్తువులకు ధర నిర్ణయించినట్లే ఆరుగాలం కష్టపడిన రైతు కూడా ధర నిర్ణయించిన రోజే రైతు ధనవంతుడు అవుతారన్నారు.