మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం చిల్వేర్ గ్రామంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. రాజు – శ్రీలత దంపతుల ఒక్క కుమారుడు సిద్ధు (9), రెండో తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులు పతంగి కొనివ్వక పోవడంతో మనస్తాపానికి గురై భయపెట్టాలని ఇంటి స్లాబ్‌కు చీరతో ఉరేసుకున్నారు. కుటుంబ సభ్యులు కాపాడే ప్రయత్నం చేసినా విఫలమయ్యారు. ఈ ఘటనతో కుటుంబంలో విషాదం నెలకొంది.