సంగారెడ్డి పట్టణం బైపాస్ రహదారిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం నిర్వహించారు. డీసీసీ అధ్యక్షురాలు, టీజీఐఐ ఛైర్ పర్సన్ నిర్మల రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీడీసీ ఛైర్మన్ రామ్ రెడ్డి, నాయకులు చేర్యాల ఆంజనేయులు వెంకటరాజు, సంతోష్ కుమార్ పాల్గొన్నారు.