WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలోని డఫ్ డీల్స్ పాఠశాలలో ఆదివారం వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు పాఠశాల ఛైర్మన్ నరేందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నట్లు తెలిపారు.