ATP: గుత్తి మండలం కొత్తపేట గ్రామ సమీపంలో శ్రీ నవ అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో ఈనెల 30న జరిగే ముక్కోటి వైకుంఠ ఏకాదశి పూజలకు హాజరుకావాలని గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డికి ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రికను అందజేశారు. ముందుగా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యేకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.