NRPT: జిల్లాలో ప్రభుత్వం నిషేధించిన చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వినీత్ హెచ్చరించారు. ఈ మాంజా మనుషులు, పక్షులు, పర్యావరణానికి ప్రాణాపాయమని పేర్కొన్నారు. విక్రయదారులపై నిఘా ఉంచేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తామని, ప్రజలు వీటి వినియోగానికి దూరంగా ఉండి సహకరించాలని ఆయన కోరారు.