టాలీవుడ్ హీరో ఆది సాయికుమార్ ప్రధాన పాత్రలో యుగంధర్ ముని తెరకెక్కించిన ‘శంబాల’ మూవీ మంచి విజయం అందుకుంది. తాజాగా ఈ సినిమాను హిందీ ప్రేక్షకులకు చూపించడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. న్యూ ఇయర్ కానుకగా జనవరి 1న బాలీవుడ్లో గ్రాండ్గా రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారట. ఈ మేరకు హిందీ వెర్షన్ సెన్సార్ పనులు దాదాపు పూర్తయినట్లు సమాచారం.