NLR: ఉదయగిరి పౌరసరఫరాల సంస్థ గోదాంలో రూ.2.10 కోట్ల విలువైన రేషన్ సరకులను నొక్కేసిన ముగ్గురు నిందితులకు ఆత్మకూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించినట్లు SI కర్నాటి ఇంద్రసేనారెడ్డి తెలిపారు. దీంతో నిందితులైన కాంట్రాక్ట్ ఉద్యోగి మునాఫ్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు షాహిద్, రఫీని ఆత్మకూరు సబ్ జైలుకు తరలించినట్లు పేర్కొన్నారు.