NDL: బనగానపల్లె పట్టణంలో ఇవాళ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించారు. కొండ పేటలో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జరుగుతున్న వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూలైన్లను ఏర్పాటు చేయాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆలయ అధికారులకు సూచించారు.