RR: తలకొండపల్లి మండల కేంద్రంలో కోతుల బెడద నివారణ చర్యలను సర్పంచ్ శేఖర్ యాదవ్ చేపట్టారు. గ్రామంలో కోతులు ప్రజలను ఇబ్బంది పెట్టడం, కొందరిని గాయపరిచిన విషయాన్ని ఎన్నికల ప్రచారంలో ఆయన దృష్టికి గ్రామస్థులు తీసుకువచ్చారు. ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కోతులను పట్టుకొని నల్లమల అడవికి తరలించారు. కోతుల తరలింపుతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.