KMR: ఇస్సనగర్ శివారులో ఇవాళ మొక్కజొన్న పంటలను ఏఈవో రాఘవేంద్ర క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పంటలో భాస్వరం లోపాన్ని గుర్తించిన ఆయన.. దీని వల్ల మొక్కల ఎదుగుదల కుంటుపడుతుందని రైతులకు వివరించారు. నివారణ కోసం లీటరు నీటిలో 5 మిల్లీలీటర్ల డీఏపీ కలిపి పిచికారీ చేయాలని సూచించారు. సకాలంలో యాజమాన్య పద్ధతులు పాటిస్తేనే ఆశించిన దిగుబడులు పొందవచ్చని తెలిపారు.