E.G: రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28లోగా లైఫ్ సర్టిఫికెట్ తప్పనిసరిగా సమర్పించాలని తూ. గో. జిల్లా ఖజానా అధికారి ఎన్. సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. గడువులోగా సమర్పించని వారికి పెన్షన్ చెల్లింపుల్లో అంతరాయం ఏర్పడే అవకాశం ఉందన్నారు. అయితే, లైఫ్ సర్టిఫికెట్ సమర్పణకు పలు సౌకర్యవంతమైన మార్గాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.