SS: కదిరి పట్టణంలోని ట్రైబల్ వెల్ఫేర్ గురుకులం పాఠశాలను ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. రెండు రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కుళ్లిన ఆహారం ఘటనపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. 29వ తేదీ లోపు అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.