SKLM: ఈ నెల 31వ తేదీన NTR భరోసా ఫింఛన్లు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పుండ్కర్ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. జనవరి 1వ తేదీన పంపిణీ చేయవలసిన పింఛన్లు నూతన సంవత్సరం దృష్ట్యా ఒకరోజు ముందుగానే NTR భరోసా పింఛన్లు పథకం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. జిల్లాలో ఉన్న లబ్ధిదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.