సత్యసాయి: తాడిపత్రి టౌన్ పోలీస్ స్టేషన్లో రెండో ఎస్సైగా దయాకర్ రెడ్డి శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. శిక్షణ పూర్తి చేసిన ఆయన తొలి పోస్టింగులో పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణ, అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారిస్తారని తెలిపారు. ప్రజలకు ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా పోలీసుల దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు.