MLG: రేపు కొత్తపల్లి గౌరీ మండలం నిజాంపల్లి గ్రామంలో అయ్యప్ప స్వామి పడిపూజ నిర్వహిస్తున్నట్లు ఆ గ్రామ అయ్యప్ప స్వాముల బృందం తెలిపింది. పడిపూజ కార్యక్రమంలో భాగంగా మహా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ మహా పడిపూజ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని ఆ దేవుని ఆశీస్సులు పొందగలరని నిజాంపల్లి అయ్యప్ప స్వాములు తెలిపారు.