WGL: పర్వతగిరి మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను శనివారం నూతన ఎంఈవో బిక్షపతి సందర్శించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఆయనను ఘనంగా సన్మానించారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని, పాఠశాల నమోదు పెంచాలని ఎంఈవో సూచించారు. పాఠశాల రికార్డులను కూడా పరిశీలించారు ప్రధానోపాధ్యాయులు ఏ. వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.