W.G: మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు కుట్టు మిషన్లు ఎంతగానో దోహదపడతాయని MLA బొమ్మిడి నాయకర్ పేర్కొన్నారు. శనివారం నరసాపురం మండలం కొప్పర్రులో 40 మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తోందని తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని స్వయం ఉపాధి పొందాలని నాయకర్ సూచించారు.