PPM: సామాజిక పింఛన్ దారులకు రాష్ట్ర ప్రభుత్వం నూతన సంవత్సర కానుకను ప్రకటించింది. జనవరి 1కి బదులుగా ఒకరోజు ముందుగా ఈ నెల 31న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేయనున్నట్టు జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆరోజు ఉదయం 7 గంటల నుంచి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇళ్ళకు వచ్చి పింఛన్లను అందజేస్తారని పేర్కొన్నారు.