తెలంగాణ మహిళా కమిషన్ ఎదుట నటుడు శివాజీ విచారణ ముగిసింది. గంటన్నర పాటు విచారణ జరిగింది. ‘మీ వ్యాఖ్యలు మహిళలపై దాడులు పెంచేలా ఉన్నాయని ఫిర్యాదులు వచ్చాయని, మీ వ్యాఖ్యలు మహిళలపై ప్రభావం చూపుతాయని తెలియదా?’.. అంటూ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మహిళల విషయంలో జాగ్రత్తగా మాట్లాడాలని శివాజీకి మహిళా కమిషన్ సూచించింది. ఇకపై మహిళల విషయంలో చులకనగా మాట్లాడబోనని శివాజీ చెప్పాడు.