WGL: నగరానికి చెందిన తోట రాజేశ్వరరావు(52) రికార్డు స్థాయిలో రక్తదానం చేసి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పటి వరకు 134 సార్లు రక్తదానం చేసిన ఆయన 150 సార్లు రక్తదానం చేయడమే తన లక్ష్యమన్నారు. తన 18వ ఏటా నుంచి ప్రతి 3 నెలలకు ఒకసారి తప్పకుండా రక్తదానం చేస్తానని చెప్పారు. తాను రక్తదానం చేయడమే కాకుండా ఇతరులకు అవగాహన కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు.