MDK: రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామంలో నూతన సర్పంచ్ వెంకటరామ్ రెడ్డి ఆధ్వర్యంలో మొదటి గ్రామసభ నిర్వహించారు. సర్పంచ్ గ్రామంలోని ప్రతి పేద కుటుంబానికి ఉపాధి కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం (EGS) ద్వారా గ్రామ అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. జాబ్ కార్డు లేని వారు వెంటనే నూతన కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని వారు తెలిపారు.