ADB: నార్నూర్ మండలంలో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్లను మంత్రి జూపల్లి కృష్ణారావు అభినందించారు. శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలో వారిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల సమస్యల పరిష్కారం, పార్టీ బలోపేతం కోసం నిరంతరం కృషి చేయాలన్నారు. రానున్న MPTC, ZPTC ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులనే భారీ మెజార్టీతో గెలిపించి సత్త చాటాలన్నారు.