AP: తూ.గో. జిల్లా నల్లజర్ల మండలం చోడవరంలో వైసీపీ శ్రేణులు అరాచకం సృష్టించారు. వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్బంగా జగన్ ప్లెక్సీ వద్ద మేకపోతును బలి ఇచ్చారు. మేకపోతు తల నరికి రప్పా రప్పా అంటూ వీడియోలు తీశారు. మేకపోతు రక్తంతో జగన్ ప్లెక్సీకి అభిషేకం చేశారు. ఈ కేసులో ఏడుగురు వైసీపీ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చోడవరం గ్రామానికి పోలీసులు భారీగా చేరుకున్నారు.