TG: కాంగ్రెస్ ఎప్పుడూ తెలంగాణకు ద్రోహమే చేసిందని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నేతలతో కేసీఆర్ భేటీ ముగిసింది. తెలంగాణ కోసం బీఆర్ఎస్ తప్ప ఇతర పార్టీలు పోరాడవన్నారు. మూడు జిల్లాలో బహిరంగ సభలకు నిర్ణయించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్రోహం, అన్యాయాన్ని బహిరంగ సభల ద్వారా ఎండగట్టాలని నేతలకు కేసీఆర్ సూచించారు.