NLG: గురు గోవింద్ సింగ్ కుమారులు ఫతేసింగ్, జోరవర్ సింగ్ల త్యాగాన్ని దేశ ప్రజలు స్మరించుకోవాలని ఏబీవీపీ ఎంజీ యూనివర్సిటీ ఉపాధ్యక్షులు కొంపల్లి సూర్య, చిట్యాల నగర కార్యదర్శి వంగూరి గణేష్ అన్నారు. చిట్యాలలో ఇవాళ ఏబీవీపీ ఆధ్వర్యంలో జాతీయ వీర బాలల దినోత్సవం సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, నేతలు పాల్గొన్నారు.