E.G: అభివృద్ధి పనుల్లో ఖచ్చితంగా నాణ్యత ప్రమాణాలు పాటించాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నగర పాలక సంస్థ అధికారులు, కాంట్రాక్టర్కు సూచించారు. శుక్రవారం రాజమండ్రిలోని 11వ డివిజన్ వీరేశలింగం పార్కు వద్ద చేపట్టిన సీసీ రోడ్డు పున నిర్మాణం పనులను ఎమ్మెల్యే పర్యవేక్షించారు. అభివృద్ధే ప్రధాన ధ్యేయంగా తాము పని చేయడం జరుగుతుందన్నారు.