నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం జరిగిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెల్లూరు రూరల్ ప్రజలకు ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఎమ్మెల్యే కార్యాలయంలో అందుబాటులో ఉంటామని, స్థానికంగా ఏ సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.