RR: నర్కుడ గ్రామ పంచాయతీ వినాయక కాలనీ, 10వ వార్డులో గత 4రోజుల నుంచి డ్రైనేజి సమస్య ఉన్నదని కాలనీ వాసులు సర్పంచ్, వార్డు మెంబెర్లకు తెలిపారు. సర్పంచ్ వెంటనే స్పందించి సెప్టిక్ క్లినర్ ట్యాంక్ ద్వారా డ్రైనేజీ వ్యవస్థను శుభ్రం చేయించారు. వెంటనే స్పందించిన సర్పంచ్, వార్డు సభ్యులకు కాలనీ వాసులు ధన్యవాదాలు తెలిపారు.