VKB: కొడంగల్లో అప్రకటిత విద్యుత్ కోతలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఆధునిక కాలంలో ప్రతి పనికీ విద్యుత్ అత్యవసరం. ముందస్తు సమాచారం లేకుండా విద్యుత్ సరఫరా నిలిపి వేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. విద్యుత్ అధికారులు స్పందించి, నిరంతర సరఫరా అందించాలని ప్రజలు కోరుతున్నారు.