PDPL: రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ అంబర్ కిషోర్ జా ఆదేశాల మేరకు ధర్మారం పోలీసుల ఆధ్వర్యంలో మేడారం గ్రామంలో శుక్రవారం రాత్రి పోలీసు కళాబృందం ప్రదర్శనలు నిర్వహించారు. మూఢనమ్మకాలు, సైబర్ నేరాలు, డ్రగ్స్ ఆత్మహత్యలు, బాల్య వివాహాలు, మొదలగు వాటిపై పాటలు, నృత్యాల రూపంలో అవగాహన కల్పించారు. షీ టీం, డయల్ 100 కు ఎలా ఫిర్యాదు చేయాలో చేయాలో వివరించారు.