KDP: వేంపల్లిలో CPI 101వ ఆవిర్భావ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. CPI జిల్లా కార్యవర్గ సభ్యులు బాయ్స్ హైస్కూల్ వద్ద జెండా ఆవిష్కరించి, కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. 1925 డిసెంబర్ 26న కాన్పూర్లో స్థాపితమైన CPI పేదలు, కష్టజీవుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతోందని నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.