VSP: పద్మనాభం ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. రెవెన్యూ, పెన్షన్లు, ఇళ్ల పట్టాలపై వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి, ఆమోదయోగ్యమైన వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మండలంలోని 60 మంది అంగన్వాడీ వర్కర్లకు 5జీ సెల్ఫోన్లు పంపిణీ చేశారు.